News November 7, 2025

రెవెన్యూ డివిజన్ల మార్పుచేర్పులపై ప్రతిపాదనలు

image

సత్యసాయి జిల్లాలో రెవెన్యూ డివిజన్ల మార్పుచేర్పులు ఇలా..
★ మడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్‌‌
★ కదిరి డివిజన్‌లోని అమడగూరు మండలం పుట్టపర్తి డివిజన్‌లోకి..
★ పుట్టపర్తి డివిజన్‌లోని గోరంట్ల మండలం పెనుగొండ డివిజన్‌లోకి..
★ రాప్తాడు నియోజకవర్గంలోని 6మండలాలను ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లలోనే కొనసాగించాలని పరిటాల సునీత లేఖ
☛ త్వరలో వీటిపై క్లారిటీ రానుంది.

Similar News

News January 13, 2026

తిరుపతి: 2నెలల జీతాలు విడుదల

image

ప్రభుత్వ గురుకుల స్కూల్లో ఉద్యోగంలో చేరిన 2025 డీఎస్సీ ఉపాధ్యాయులకు 2నెలల జీతాలు విడుదలయ్యాయి. ప్రాన్ నెంబర్ సమస్యతో ఉద్యోగంలో చేరిన 3నెలల్లో 2నెలలు జీతాలు రాలేదని Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన అధికారులు 1100 మంది ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేశారు.

News January 13, 2026

ఖమ్మం: ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

image

ఖమ్మం శ్రీరాంనగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIGఫ్లాట్ల దరఖాస్తు గడువును జనవరి 20వరకు పొడిగించినట్లు చీఫ్ ఇంజనీర్ జివి రమణారెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించామని చెప్పారు. అల్పాదాయవర్గాల కోసం కేటాయించిన ఈఫ్లాట్లకు ఆసక్తి గల వారు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. జనవరి 23న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

News January 13, 2026

షాక్స్‌గామ్‌పై పాక్-చైనా ఒప్పందం చట్టవిరుద్ధం: ఆర్మీ చీఫ్

image

షాక్స్‌గామ్ లోయలో చైనా చేపడుతున్న నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్-చైనా మధ్య 1963 నాటి ఒప్పందం చట్టవిరుద్ధం. CPEC 2.0పై ఆ దేశాల సంయుక్త ప్రకటనను మేము అంగీకరించం. అక్కడ ఎటువంటి కార్యకలాపాలకు భారత్ అంగీకరించదు. దీనిపై MEA ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది’ అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. కాగా కారకోరం శ్రేణికి ఉత్తరాన ఈ లోయ ఉంది.