News August 28, 2024

రెవెన్యూ సదస్సులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి: కలెక్టర్

image

త్వరలోజరగనున్న గ్రామ రెవెన్యూ సదస్సులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌తో కలసి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్డీవోలు, తహశీల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో సమీక్షించారు. ప్రతి గ్రామంలోను సభలు నిర్వహించాలన్నారు.

Similar News

News September 9, 2024

నిమజ్జన ప్రదేశాల్లో భద్రత నియమాలు పాటించాలి: ఎస్పీ

image

శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన ఇరువైపులా వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాలను సోమవారం ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులతో సందర్శించారు. భద్రతపరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పొన్నాడ వంతెన, ఏడు రోడ్ల-గుజారతిపేట వంతెన, డే&నైట్ వంతెన ఇరువైపులా నిమజ్జనం చేసే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.

News September 9, 2024

సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండి: జిల్లా కలెక్టర్

image

నేడు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, నదీ పరిహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08942-2405575) ఫోన్ చేయాలని, అలాగే ఈ-మెయిల్ ఐడీ coskimsupdtd@gmail.com పంపించాలని తెలిపారు.

News September 9, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ

image

శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.