News December 2, 2025
రేణిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీసుకుందాం..!

యాదాద్రి(D) రాజాపేట(M) రేణికుంట గ్రామ పంచాయతీకి గతంలో రాష్ట్ర ఉత్తమ అవార్డు లభించింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందిన తమ గ్రామానికి హరితహారం, స్వచ్ఛభారత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి నిర్వహణలో జాతీయ అవార్డు కూడా లభించిందని మాజీ సర్పంచ్ భాగ్యమ్మ తెలిపారు. స్వయం సమృద్ధి విభాగంలో 2021-22లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బెస్ట్‌గా నిలిచిన ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News February 13, 2026
7 తరాలు మర్చిపోవు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ‘మా లైన్లోకి రాకపోతే (ఇటీవల రూ.10కోట్లు డిమాండ్ చేశారు) జరిగే పరిణామాలు వచ్చే 7 తరాలు మర్చిపోవు’ అని ఆడియో మెసేజ్‌లో రణ్‌వీర్‌ను హెచ్చరించింది. ‘మీ స్టాఫ్, వారి ఫ్యామిలీ మూమెంట్స్ సేకరించాం. వారిపై దాడి చేస్తే మీకు తెలిసి వస్తుందేమో’ అని గ్యాంగ్‌లోని హారీ బాక్సర్ పేరుతో వార్నింగ్ వచ్చింది.
News February 13, 2026
సిరిసిల్ల: ‘ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి’

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పరిధిలోని సినారె కళామందిరాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు, టపాసులు పేల్చడం, భారీగా గుంపులు గుంపులుగా గుమి కూడడం, ఫంక్షన్ హాల్స్ లో సమావేశం ఏర్పాటు చేయడం నిషేధమన్నారు.
News February 13, 2026
ఓపెన్ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ శాఖల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 2 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అధికారులు బృంద స్ఫూర్తితో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని సూచించారు. నిబంధనల అమలులో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు.


