News February 17, 2025
రేణిగుంట చేరుకున్న CM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. కాగా మూడు రోజుల పాటూ జరగనున్న టెంపుల్ ఎక్స్‌ఫో కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. తిరుపతిలో నేటి నుంచి 3 రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ఆయన మహారాష్ట్ర, గోవా సీఎంలతో కలిసి పాల్గొననున్నారు.
Similar News
News March 13, 2026
భీమేశ్వరుడికి కానుకల వర్షం.. హుండీ ఆదాయం ఎంతంటే?

వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రెండు కోట్ల పదహారు లక్షలకు పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 33 రోజుల కాలంలో హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 2,16,65,140/- నగదు, 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
News March 13, 2026
పాలమూరు: కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి మృతి

మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డా కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.
News March 13, 2026
విషాదం.. సాఫ్ట్‌వేర్ దంపతుల దుర్మరణం

ఆదోని నుంచి బెంగళూరుకు కారులో వెళ్తున్న దంపతులను మృత్యువు వెంటాడింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనురాగ్, ఐశ్వర్య దుర్మరణం చెందారు. కర్ణాటక సరిహద్దులో జరిగిన ఈ ఘటనలో ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అనురాగ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. బెంగళూరులో సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతుల మృతితో ఆదోని తిరుమలనగర్‌లో విషాదం అలుముకుంది.


