News February 19, 2025
రేపటి నుంచి కేయూ దూర విద్య సెమిస్టర్ పరీక్షలు

కేయూ పరిధిలోని దూర విద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎంఏ జర్నలిజం, హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Similar News
News April 13, 2026
HYD: GREAT.. 11ఏళ్లుగా FREE కోచింగ్

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.
News April 13, 2026
IPL తరహాలో గుంతకల్లులో క్రికెట్ టోర్నమెంట్

గుంతకల్లులోని పాతగుంతకల్లులో ఐపీఎల్ తరహాలో ఓల్డ్ గుంతకల్ ప్రీమియర్ లీగ్ (ఓజీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఐపీఎల్ తరహాలోనే టీం సెలక్షన్, ప్లేయర్స్ యాక్షన్ జరిగింది. ఆదివారం జరిగిన ప్లేయర్స్ యాక్షన్‌లో పలువురు పాతగుంతకల్లు యువకులు పాల్గొన్నారు. షాడో బ్లాస్టర్స్, సిడ్నీ సిక్సర్స్, కిట్టు స్మాషర్స్, రాయల్ స్ట్రైకర్స్, ఛాంపియన్ చేజర్స్ టీమ్స్ ఉన్నాయి. త్వరలోనే టోర్నీ ప్రారంభంకానుంది.
News April 13, 2026
పార్వతీపురం జిల్లాలో 42 మందిపై కేసులు నమోదు: ఎస్సీ

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.


