News March 20, 2025
రేపటి నుంచి పాలమూరు యూనివర్సిటీ బీఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు

పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన బీఈడీ రెగ్యులర్, బ్యాక్లాగ్ థర్డ్ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలు మార్చి 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలన్నీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సా.5 గంటల వరకు జరుగుతాయి.పరీక్షలు అన్నీ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని MALD గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జరుగుతాయి. విద్యార్థులందరూ పాలమూరు యూనివర్సిటీ టైం టేబుల్ ప్రకారం పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ తెలిపారు.
Similar News
News April 23, 2025
NZB: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.
News April 23, 2025
భూపాలపల్లి జిల్లా విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులతో విద్యార్థి అబ్బుర పరిచాడు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన దుగ్గిశెట్టి పున్నం చందర్ కుమారుడు విహార్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 468/470 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచాడు. విహార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కష్టాలు చూసి మనం ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే చదువే ముఖ్యం అని అన్నాడు. అనంతరం పలువురు అభినందించారు.
News April 23, 2025
NZB: తల్లికి క్యాన్సర్.. కొడుకు ఆత్మహత్య

తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిచ్‌పల్లిలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన కర్రినోల్ల భూలక్ష్మి కొన్ని సంవత్సరాలుగా కాన్సర్‌తో పడపడుతుంది. ఇది జీర్ణించుకోలేక కొడుకు రంజిత్(28) ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.