News September 1, 2024

రేపు ఇడుపులపాయకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రేపు ఇడుపులపాయలో YS జగన్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం పులివెందుల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

Similar News

News September 10, 2024

కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్

image

కడప రూరల్ సబ్ రిజిస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుందరేశన్‌ను ఉన్నతాధికారులు సస్పండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్‌గా పంపారు. ఇటీవల కడపకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ జరిగిన కొన్ని రిజిస్ట్రేషన్లపై తీవ్ర స్థాయిలో ఆరరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో తప్పిదాలకు కారణమైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

News September 10, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్‌కు విశేష స్పందన

image

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన, సత్వర పరిష్కారం లభించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం ఏడుగురు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కడప ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ వెంకటపతి ఆదేశించారు.

News September 10, 2024

కడప: పెళ్లి కాలేదని నమ్మించి మోసం

image

కడప రిమ్స్‌లో పనిచేసే మహిళను వైద్యశాఖలో పనిచేస్తున్న కృష్ణ 11ఏళ్ల క్రితం పెళ్లి కాలేదని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. బాధితురాలు సోమవారం కలెక్టరేట్ ముందు విషద్రావకం తాగడంతో పోలీసులు ఆసుప్రతికి తరలించారు. కృష్ణ గతంలో దాడి చేశారని చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. కాగా కృష్ణ అన్నమయ్యలో డిప్యూటీ డీఎంహెచ్వోగా పని చేస్తున్నాడు.