News April 14, 2024

రేపు, ఎల్లుండి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ పర్యటన: బీటీ నాయుడు

image

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల 15, 16వ తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వెల్లడించారు. 15న కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కొండరెడ్డి బురుజు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రికి కర్నూలులోనే బస చేసి, 16న ఎమ్మిగనూరులో సాయంత్రం 4 గంటలకు, కోసిగిలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగిస్తారని వివరించారు.

Similar News

News December 6, 2025

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

image

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.

News December 6, 2025

బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

image

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త.!

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.