News November 30, 2025

రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లోనూ డిసెంబరు 1న (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు అన్నారు.

Similar News

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.

News February 13, 2026

మెట్‌పల్లి: మూడవ రౌండ్‌లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే

image

మెట్‌పల్లి మున్సిపాలిటీ వార్డుల్లో 3వ రౌండ్ విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవే. 3వ వార్డు బత్తుల నరేశ్ కాంగ్రెస్, 6వ వార్డు బంగారుకాళ్ల నీరజ బీఆర్ఎస్, 9వ వార్డు బొడ్ల వసుధ బీజేపీ, 12వ వార్డు సుమయ్య తబస్సుం ఇండిపెండెంట్, 15వ వార్డు అరిగేలా అనూష బీజేపీ, 18వ వార్డు చెట్లపెల్లి మీనా, 21వ వార్డు ఖాజా అజీమ్ వొద్దిన్ ఇండిపెండెంట్ 24వ పూదరి జ్యోతి బీఆర్ఎస్ విజయం సాధించారు.

News February 13, 2026

కోరుట్లలో ‘హస్తం’ హవా.. మ్యాజిక్ ఫిగర్‌ దాటిన కాంగ్రెస్‌

image

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 33 వార్డులకు గాను కాంగ్రెస్‌ 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 8 వార్డులకు పరిమితం కాగా.. బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. హస్తం పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో మున్సిపల్ పీఠం ఆ పార్టీ పరం కావడం ఖాయమైంది.