News September 9, 2025
రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి: ఆదిలాబాద్ కలెక్టర్

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 10న అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కావున రిమ్స్ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించే వర్ధంతి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ, రజక సంఘాల నాయకులు, ప్రజలు హాజరవ్వాలని కోరారు.
Similar News
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.
News December 14, 2025
సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగిన ADB కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా పలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావల మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్లు అందంగా తయారు చేశారు. కేంద్రం పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటర్లతో కలిసి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగారు.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 58.17% పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58. 17% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 58.00 శాతం, బేల 59.09, జైనథ్ 56.45, బోరజ్ 55.49, భీంపూర్ 59.99, సాత్నాల 63.46, తాంసి 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.


