News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News January 24, 2026

విశాఖ సీపీ కార్యాలయంలో రికవరీ మేళా

image

విశాఖ సీపీ కార్యాలయంలో శనివారం రికవరీ మేళా నిర్వహించారు. డిసెంబర్ నెలలో మొత్తం 77 కేసులలో 44 కేసులు చేధించి 42 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.1,07,17,800 స్వాధీనం చేసుకొని వాటి యజమానులకు అందించారు. ఇందులో 294.155 గ్రాముల బంగారం, 301.58 గ్రాముల వెండి, రూ.1,72,500, 15 మోటార్ సైకిల్లు, ఒక ఆటో, 340 మొబైల్ ఫోన్స్, 12 ఆటో బ్యాటరీలు, ఒక బస్సు, 2 మెట్రిక్ టన్నుల కోల్ ఉన్నాయి.

News January 24, 2026

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్: క్రిక్ బజ్

image

T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ICC చేర్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గ్రూప్-సిలోని ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లతోపాటు స్కాట్లాండ్ కూడా ఉంటుందని పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య కొంత కాలంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా <<18925836>>భారత్‌లో<<>> ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. BCB నిర్ణయంపై ఆ దేశ ప్లేయర్లూ <<18935631>>ఆందోళన <<>>వ్యక్తం చేశారు.

News January 24, 2026

సిరిసిల్ల: ఖననం చేసిన 24 రోజులకు పోస్టుమార్టం.. కారణం ఇదే!

image

మృతదేహం పాతిపెట్టిన 25 రోజులకు పోస్టుమార్టం చేసిన ఘటన పోచెట్టిపల్లిలో చోటు చేసుకుంది. పూడూరి ఎల్లయ్య (61) డిసెంబర్ 18న కారు ఢీకొని చికిత్స పొందుతూ 31న మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి చికిత్స చేయించడంతో మృతదేహాన్ని ఖననం చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము, కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం పోస్టుమార్టం రిపోర్టు అవసరమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, శనివారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేశారు.