News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News January 22, 2026
కదిరిలో మహిళ ఆత్మహత్య

కదిరిలో మున్ని అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
News January 22, 2026
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం ఎప్పుడో ?

KNR నూతన కలెక్టరేట్ ప్రారంభం మరోసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అద్దె భవనాలు ఖాళీ చేయాలని, వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూతన కలెక్టరేట్ ప్రారంభం మరింత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
News January 22, 2026
తిరుమలకు 2.5లక్షల మంది వస్తారని అంచనా

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఈనెల 25న మలయప్ప స్వామి ఏడు వాహనసేవలపై దర్శనమిస్తారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఉదయం 5:30కు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి 8కు చంద్రప్రభ వాహనంతో సేవలు ముగుస్తాయి.14 రకాల అన్నప్రసాదాలను 3,700 మంది శ్రీవారి సేవకులతో పంపిణీ చేస్తారు. 1,260 పోలీసులు,1,200 విజిలెన్స్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 2.5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.


