News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News January 20, 2026

ఏలూరు జాతర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్‌

image

ఏలూరులో జాతర మహోత్సవాల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జేబుదొంగలు, ఆకతాయిల కదలికలపై నిఘా ఉంచాలని, భద్రత విషయంలో రాజీ పడకూడదని పోలీసు శాఖకు స్పష్టం చేశారు.

News January 20, 2026

పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

image

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

News January 20, 2026

మెరుగైన శిక్షణతో విధుల్లో మరింత రాణించగలం: వరంగల్ సీపీ

image

పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుగైన శిక్షణ పూర్తి చేయడం ద్వారా అప్పగించిన పనుల్లో మరింత రాణించగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన ఆరు నెలల ఆయుధ మరమ్మతులపై శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో శిక్షణా కేంద్రం నుంచి జారీ చేసిన ధ్రువ పత్రాన్ని శివకుమార్‌కు సీపీ అందజేశారు.