News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News January 20, 2026
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?

ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. SHARE IT
News January 20, 2026
BREAKING: భూపాలపల్లి: యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు PS పరిధిలోని రుద్రారం పంచాయతీ పరిధి చిగురుపల్లి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. రెండు మోటార్ బైక్‌లపై ముగ్గురు కిషన్‌రావుపల్లికి వెళ్తున్నారు. ఒక బైక్ వేగంగా చెట్టును ఢీకొనగా ఇద్దరు కిందపడి మృతిచెందారు. మరొక యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.
News January 20, 2026
ఆ పాపాలే మీకు శాపాలు: కాకాణి

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆత్మకూరులో ఆయన మాట్లాడుతూ. కూటమి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న పాపాలు వారికి భవిష్యత్తులో శాపాలుగా మారుతాయని చెప్పారు. ఎంపీ గురుమూర్తి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


