News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News January 21, 2026

HYD: VIT-D పుష్కలం.. 10 రోజుల్లో సాగు మెలకువలు

image

శరీరానికి VIT- Dని సంవృద్ధిగా అందించే పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది. 10 రోజుల్లో సాగు మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్నారా? విస్తరణ విద్యాసంస్థ, ప్రొ.జయ శంకర్ యునివర్సిటీ నిపుణులు వీటి సాగుపై నైపుణ్య శిక్షణను FEB 18- 28వరకు రాజేంద్రనగర్‌లో ఇస్తారు. ఆసక్తిగలవారు అప్లికేషన్ ఫామ్, సమాచారం కోసం వెబ్‌సైట్లు www.eeihyd.org/ www.pjtau.edu.inలో చూడాలని, అప్లై చేయడానికి FEB 8 వరకే అవకాశం ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్‌ GEN-Zలో ట్రాన్స్‌ఫార్మేషన్

image

మన నగర కుర్రాళ్లు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. దీంతో ‘రెట్రో’ స్టైల్స్, లో-రైజ్ జీన్స్, ఆ ఫ్లిప్ ఫోన్ల సౌండ్ మళ్లీ వినబడుతోంది. హైటెక్ సిటీ పాప్-అప్‌లలో కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు తింటూ, విదేశీ మాక్‌టైల్స్ సిప్ చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం లోకల్ బజార్లలో దొరికే బట్టలనే ఫెంటాస్టిక్ మోడల్స్‌లా డిజైన్ చేసి, నెట్టింట్లో పెడుతున్నారు. ఇలా ట్రాన్స్‌ఫార్మేషన్ రీల్స్‌ పిచ్చెక్కిస్తున్నాయి.