News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News January 24, 2026
నరసరావుపేటలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

ఆడబిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. బాలికల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి రక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
News January 24, 2026
ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోడౌన్‌ను పరిశీలించిన ఏలూరు కలెక్టర్

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల గోడౌన్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. భద్రత సీళ్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు గోడౌను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News January 24, 2026
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్.. 16 అర్జీల స్వీకరణ

పల్నాడు కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశాల మేరకు నిర్వహించిన ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై మెుత్తం 16 అర్జీలను సమర్పించారు. వీటిపై జేసీ సంజన సింహా స్పందించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తూ, గడువులోగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


