News September 11, 2025

రేపు పాడేరులో ఆరోగ్య పరీక్ష శిబిరం

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం (రేపు) ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనునట్లు తెలిపారు.

Similar News

News December 9, 2025

JMKT: గత వారం లాగానే నిలకడగా పత్తి ధర

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 68 వాహనాల్లో 546 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,300, కనిష్టంగా రూ.6,600 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. మార్కెట్లో కార్యకలాపాలను చైర్ పర్సన్ స్వప్న పరిశీలించారు. పత్తి ధర శుక్రవారం లాగానే నిలకడగానే కొనసాగింది.

News December 9, 2025

మెదక్: గ్రామాల్లో.. వాట్సప్ ప్రచారాలు

image

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.

News December 9, 2025

అమరావతిలో రూపుదిద్దుకుంటున్న AIS సెక్రటరీల బంగ్లాలు

image

అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పటికే అమరావతి ప్రాంతంలోని
రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న AIS సెక్రటరీల బంగ్లాలు రూపుదిద్దుకోవడం. మొత్తం 90 బంగ్లాలు వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు రాత్రింబవళ్లు ఐకానిక్ టవర్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.