News November 16, 2025
రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10 ఆపై చదివినవారు అర్హులన్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపువారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 15, 2026
రాజ్యాంగానికి రాహుల్, రేవంత్ తూట్లు: KTR

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు స్పీకర్ <<18864508>>క్లీన్‌చిట్<<>> ఇవ్వడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా.. ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే. రాహుల్, రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. జంప్ జిలానీలకు, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా BRS పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
News January 15, 2026
PhonePe రూ.5వేల గిఫ్ట్.. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

సంక్రాంతి వేళ వాట్సాప్ గ్రూపుల్లో ఓ లింక్ వైరల్‌గా మారింది. ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్- అన్ని వినియోగదారులకు రూ.5000’ అంటూ ఓ లింక్ షేర్ అవుతోంది. యూజర్లను టెంప్ట్ చేసేలా ఉన్న ఈ లింక్ ఓపెన్ చేస్తే ‘404’ అని వస్తోంది. కాగా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డబ్బులకు ఆశపడి లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?
News January 15, 2026
తిరుపతి: ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు…?

TTD, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ప్రజలు భూ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో శేషసాయి నగర్‌లో ఉన్న భూములను 22A క్రింద తీసుకొచ్చారు. దీంతో ఈ ల్యాండ్స్ లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు రాకుండా నిలిచిపోయాయి. 22A నిబంధనలు, IDT క్లెయిమ్స్ వల్ల చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను అనుభవించలేక, వేరొకరికి అమ్మలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.


