News March 9, 2025
రేపు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 23, 2026
మరణం లేని యోధుడు నేతాజీ!

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటుచేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఇవాళ నేతాజీ జయంతి.
News January 23, 2026
నారా లోకేశ్‌కు Jr.NTR బర్త్‌డే విషెస్

AP: మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది లోకేశ్‌కు అద్భుతంగా సాగాలని హీరో Jr.NTR ఆకాంక్షించారు. ఆయనకు మరింత శక్తి, సుఖసంతోషాలు కలగాలని Dy.CM పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నేత అంటూ హోంమంత్రి అనిత, మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రముఖులు లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
News January 23, 2026
గురుకుల ప్రవేశాల గడువు 25 వరకు పొడిగింపు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


