News September 13, 2025

రేపు విజయవాడలో సదస్సు.. హాజరుకానున్న హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్

image

బాలికల సంరక్షణపై ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు హైకోర్టు CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, అధికారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బాలికల రక్షణ, వారిపై నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సదస్సులో చర్చలు జరుగుతాయన్నారు.

Similar News

News December 14, 2025

రాజోలి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను ఆదివారం కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కౌంటింగ్‌లో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు.

News December 14, 2025

GNT: వరుసగా మూడోసారి మన జిల్లా టాప్

image

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.

News December 14, 2025

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

image

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.