News January 13, 2025
రేపు విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రేపు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. రేపు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
Similar News
News February 14, 2025
పాత గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్‌డెడ్

పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
నేవీ క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పద మృతి

నేవీ అధికారుల క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ క్వార్టర్స్‌లో కమల అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా ఓ అధికారి ఇంట్లో పని చేస్తుంది. వారు పని మీద బయటకు వెళ్లారు. మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. గురువారం పక్క ఫ్లాట్ వాళ్లు కిటికీలోంచి చూడగా ఆమె బట్టలు లేకుండా కింద పడి ఉంది. దీంతో సెక్యురిటీకి సమాచారం అందించారు. మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 14, 2025
నేడు విశాఖ రానున్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖ రానున్నారు. ఈరోజు సాయంత్రం 6:40కు విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి నగరంలో గల టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్య నాయకులతో సమావేశమై రాత్రి టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. శనివారం భోగపురంలో గల ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని శనివారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విజయవాడ వెళ్తారు.