News August 13, 2025

రేపు సంగారెడ్డి జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవు

image

సంగారెడ్డి జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డిఈఓ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రకాల ప్రిన్సిపల్స్ ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

ఈనెల 18 నుంచి పెళ్లిళ్లు.. గ్యాస్ కొరతపై ఆందోళన

image

ఈనెల 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. యుద్ధం వల్ల ఏర్పడిన గ్యాస్ కొరత ప్రభావం పెళ్లి భోజనాలపై పడనుంది. ఫంక్షన్లకు పెద్ద ఎత్తున వంటలు చేసే క్యాటరింగ్ నిర్వాహకులు గ్యాస్ స్టవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వంటలు ఎలా చేయాలనే ఆందోళన మొదలైంది. ఇక కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెలకూ డిమాండ్ పెరుగుతుండడంతో వివాహాలు చేసే కుటుంబాలపై మరింత భారం పడనుంది.

News March 13, 2026

ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

image

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

News March 13, 2026

భీమేశ్వరుడికి కానుకల వర్షం.. హుండీ ఆదాయం ఎంతంటే?

image

వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రెండు కోట్ల పదహారు లక్షలకు పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 33 రోజుల కాలంలో హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 2,16,65,140/- నగదు, 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.