News November 19, 2025
రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 16, 2026
పల్నాడు జిల్లాలో కీలక పట్టణంగా పిడుగురాళ్ల!

పల్నాడు జిల్లాలో కీలక పట్టణంగా పిడుగురాళ్ల రూపుదిద్దుకుంటోంది. జిల్లాలో అతి పెద్దదైన పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం 2026-27లో 100 MBBS సీట్ల ప్రవేశం, బెడ్ల పెంపకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాపార కేంద్రమైన పిడుగురాళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు సైతం పిడుగురాళ్ల కేంద్రంగా నియోజకవర్గ రాజకీయాలు పర్యవేక్షిస్తున్నారు.
News January 16, 2026
MDK:‘ఫోన్ పే రూ.5000 Gift’.. జాగ్రత్త !

పండుగ బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. “ఫోన్‌పే పొంగల్ గిఫ్ట్” అంటూ రూ.5,000 ఆశ చూపిస్తూ వస్తున్న నకిలీ లింకులపై ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఇలాంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, ఆన్‌లైన్ మోసాల పట్ల అవగాహనతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News January 16, 2026
విజయనగరంలో కేజీ చికెన్ రూ.240

నేడు కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. కాగా నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ (స్కిన్) రూ.260, స్కిన్ లెస్ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.


