News November 19, 2025

రేపు హైదరాబాదుకు సిట్ బృందం..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా 20న హైదరాబాదులో విచారించేందుకు 19న సిట్ బృందం వెళ్లే అవకాశం ఉంది. రెండు రోజులపాటు విచారణ చేసేఅవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 17, 2026

పెద్దపల్లి: కలెక్టర్‌ చొరవ.. అనాథ మహిళకు ఆశ్రయం

image

మానసిక అనారోగ్యంతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అండగా నిలిచారు. తనకు ఎవరూ లేరని, ఆదుకోవాలని ఆమె పెట్టుకున్న అర్జీపై కలెక్టర్ తక్షణమే స్పందించారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లోని ‘అమ్మానాన్న’ అనాథ ఆశ్రమానికి తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత శనివారం వారిని సురక్షితంగా ఆశ్రమానికి చేర్చారు.

News January 17, 2026

నల్గొండ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

image

నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పాత మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా మారడంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, వసతులు సమకూరుతాయని తెలిపారు.

News January 17, 2026

విశాఖకు రానున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే?

image

పార్లమెంటరీ రక్షణ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో ఎంపీల బృందం జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా తదితరులు ఉన్నారు. వీరు ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL)లో డీఆర్డీఓ ప్రాజెక్టులను, కోస్ట్ గార్డ్ తీరప్రాంత భద్రతను సమీక్షించనున్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో నగరం అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.