News March 13, 2025

రేపు హోళీ.. ములుగు ఎస్పీ వార్నింగ్!

image

హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని ములుగు ఎస్పీ శబరిశ్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇతరులపై బలవంతంగా రంగులు వేయకుండా, పరస్పర గౌరవంతో పండుగా జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం నేరమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సంప్రదించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దన్నారు.

Similar News

News February 19, 2026

గజ్వేల్: ‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’

image

‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’ అని గజ్వేల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కాయకల్ప పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన టీం లీడర్లు డాక్టర్ విజయ్, డాక్టర్ నీరజ బృందం బుధవారం గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను వారు పరిశీలించి, ఇక్కడి నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు.

News February 19, 2026

T20 WC: ఇవాళ 3 మ్యాచులు

image

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు వెస్టిండీస్- ఇటలీ, 3PMకు శ్రీలంక-జింబాబ్వే, 7PMకు అఫ్గాన్-కెనడా ఆడనున్నాయి. ఇప్పటికే సూపర్-8 జట్లు ఖరారు అయ్యాయి. దీంతో నేటి మ్యాచులు నామమాత్రమే. రేపు ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈనెల 21 నుంచి సూపర్ 8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 22న సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది.

News February 19, 2026

SKLM: కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి.. PHOTO

image

శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో పెద్దకుమారుడు రాజు మృతి చెందగా, కన్నతల్లే కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. గతంలో చిన్నకుమారుడు మరణించగా తండ్రి తలకొరివి పెట్టారు. ఇప్పుడు రెండో కుమారుడు కూడా దూరమవడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై కొడుకుకు వీడ్కోలు పలికింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.