News November 6, 2025
రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి: నాదెండ్ల

AP: జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘2400 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నాం. కిలో రూ.18 చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తాం. నవంబర్‌లో వర్ష సూచన నేపథ్యంలో కౌలు రైతులకు ఉచితంగా 50 వేల టార్పాలిన్లు ఇస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు ఖాతాల్లో డబ్బు జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. సెలవుంటే తర్వాత రోజు పడతాయి’ అని తెలిపారు.
Similar News
News January 22, 2026
ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్‌ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.
News January 22, 2026
విజయ్ సినిమా పేరే పార్టీ గుర్తు.. ఓటర్లు ‘విజిల్’ వేస్తారా?

తమిళ హీరో విజయ్ ‘TVK’ పార్టీకి EC ఇవాళ విజిల్ గుర్తును కేటాయించింది. అయితే ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘విజిల్’ పేరిటే ఎన్నికల గుర్తు రావడంతో ఫ్యాన్స్‌తో పాటు కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. రెండింటికీ లింక్ చేస్తూ ‘విజిల్ పోడు’ అని SMలో పోస్టులు పెడుతున్నారు. మూవీ మాదిరే పార్టీ కూడా ఎన్నికల్లో విజిల్ వేసి గెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో TNలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.
News January 22, 2026
కాసేపట్లో కేసీఆర్‌ను కలవనున్న కేటీఆర్, హరీశ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల నేపథ్యంలో మాజీ CM KCRతో KTR, హరీశ్ రావు భేటీ కానున్నారు. కాసేపట్లో వారిద్దరూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై గులాబీ బాస్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే హరీశ్‌ను సిట్ విచారించగా రేపు రావాలని KTRకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.


