News April 24, 2025
రైతులకు భూ భారతి భరోసా: WGL కలెక్టర్

పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
Similar News
News March 15, 2026
ధాన్యం కొనుగోలుకు 240 కేంద్రాలు: కలెక్టర్ సత్యశారద

జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమీక్షించారు.
News March 14, 2026
మొదటి రోజు 99.9 శాతం హాజరు: డీఈవో

వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 99.8 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీఈవో రంగయ్య వెల్లడించారు.
News March 14, 2026
WGL: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ భారీగా పెరుగుదల

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతింటుందనే ఆందోళనతో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. జిల్లాలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరిలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్‌లు ఉండగా, శుక్రవారం ఒక్క రోజే 59,200 బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో అత్యవసరంగా అవసరమైన వారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నాయి. సరఫరాలో అంతరాయం లేదని, అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని అధికారులు తెలిపారు.


