News May 7, 2025

రైతులకు మేలు చేసేందుకే భూభారతి: భద్రాద్రి కలెక్టర్

image

చండ్రుగొండ మండల కేంద్రంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ పాల్గొని మాట్లాడారు. భూభారతితో రైతులకు మేలు చేసే విధంగా నూతన విధానాలను తీసుకువచ్చామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాయం జరిగేల తీసుకుంటున్నామని వివరించారు.

Similar News

News February 17, 2026

కామారెడ్డి: రాజకీయ అనుభవం లేని ఛైర్‌పర్సన్

image

కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణికి రాజకీయ అనుభవమేమీ లేదు. ఆమె భర్త ఇప్ప శ్రీనివాస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె BSc, BEd వరకు చదువుకున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. వారి కుటుంబానికి BRSతో అనుబంధం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. భర్త ఇప్ప శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాణిస్తున్నారు. ఆమె స్వగ్రామం రాజంపేట.

News February 17, 2026

వీడ్కోలులోనూ అక్కసు వెళ్లగక్కడం మానలేదు

image

బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు యూనస్ చేసిన వీడ్కోలు ప్రసంగం వివాదాస్పదమైంది. భారత్ పేరు ప్రస్తావించకుండా ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ ట్రేడ్ పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఇకపై బంగ్లాదేశ్ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. యూనస్ హయాంలో బంగ్లాలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకం కాగా తన ప్రసంగంలో దేశప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించామని ఆయన చెప్పుకోవడం విడ్డూరం.

News February 17, 2026

కోనసీమ: సచివాలయం మీద YS జగన్ ఫొటో

image

NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా అధికారుల తీరు మారలేదని TDP సీనియర్ నేత చుట్టుగుళ్ల కిషోర్ మంగళవారం ధ్వజమెత్తారు. మామిడికుదురు మండలం పాసర్లపూడి సచివాలయం-2లో మాజీ CM జగన్ చిత్రపటాన్ని తొలగించాలని కోరినా స్పందన లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.