News September 10, 2025
రైతుల కోసం అగ్రికల్చర్ వాట్సాప్ ఛానల్ ప్రారంభం

రాష్ట్ర వ్యవసాయశాఖ కొత్తగా వాట్సప్ ఛానెల్ ను ప్రారంభించింది. అగ్రికల్చర్ డిపార్టుమెంట్ తెలంగాణ పేరుతో గత నెల 8న అందుబాటులోకి తెచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 35 వేల మంది రైతులు ఫాలోవర్స్ గా ఉన్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ రైతాంగానికి కీలకమైన సమాచారం, సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.
Similar News
News December 15, 2025
సోషల్ మీడియా వెట్టింగ్.. ఏం చేస్తారు?

‘నా అకౌంట్.. నా ఇష్టం.. ఏమైనా పోస్టు చేస్తా.. కామెంట్ చేస్తా’ అని అంటే USలో చెల్లుబాటు కాదు. చదువు, ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లాలనుకునే వ్యక్తుల FB, X, ఇన్‌స్టా, లింక్డిన్ తదితర SM అకౌంట్లలోని పోస్టులు, కామెంట్లను US అధికారులు లోతుగా <<18568140>>పరిశీలిస్తారు.<<>> డిలీట్ చేసినా పట్టేస్తారు. జాత్యాహంకార, లైంగిక, హింసాత్మక, చట్టవిరుద్ధ వ్యాఖ్యలు, USకు వ్యతిరేక ఆలోచనలు ఉన్నట్లు అనిపిస్తే వీసా రిజెక్ట్ చేస్తారు.
News December 15, 2025
తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.
News December 15, 2025
రేపటి నుంచి ‘ధనుర్మాసం’ ఆరంభం!

పరమ పవిత్రమైన ధనుర్మాసం రేపటి నుంచి (DEC 16) మొదలవుతుంది. ఈ మాసం విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు. ఈ పుణ్యమాసంలోనే శ్రీకృష్ణుడిని పతిగా పొందాలని గోదాదేవి (ఆండాళ్) రచించిన తిరుప్పావై పాశురాలను ఆలపిస్తారు. ఈ తిరుప్పావై గానం ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆ పాశురాలు, ధనుర్మాసంలో చేయాల్సిన పూజలు, వ్రతాల ప్రాముఖ్యత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


