News May 7, 2025

రైతు ఉత్పత్తి సంఘాలతో ఉపాధి కల్పన: గండ్ర

image

అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025, రైతు ఉత్పత్తి సంఘాల అభివృద్ధి అనే అంశాలపై కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు ద్వారా గ్రామీణ మహిళలకు, యువతకు ఉపాధి కల్పన అలాగే సన్న, చిన్నకారు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు.

Similar News

News February 17, 2026

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ దూరం

image

ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్‌గేట్స్‌ దూరంగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎప్‌స్టీన్ బాధితులకు అండగా ఉండటమే ముఖ్యమని వెల్లడించాయి. అమ్మాయిలతో బిల్‌గేట్స్ దిగిన ఫొటోలు ఇటీవల ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భారత పర్యటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాంటి వ్యక్తిని ఆహ్వానించడం ఏంటని ప్రశ్నలొచ్చాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News February 17, 2026

బీర పంటలో మంచి దిగుబడి, ధర రావాలంటే..

image

బీర విత్తనాలను నాటిన తర్వాత మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. దీని వల్ల ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే విత్తనం రకాన్ని బట్టి బీర పంట 60 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. ముదిరితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి.

News February 17, 2026

రికార్డుల వేట.. ఎగవేతదారుల కోటలకు బీట!

image

సెల్ఫ్ అసెస్‌మెంట్ పేరుతో ఆస్తి పన్ను లెక్కల్లో మాయాజాలం చేసిన వారికి కాలం చెల్లింది. అద్దె విలువను (ARV) తక్కువ చూపిస్తూ పన్ను ఎగ్గొట్టే బడా బాబుల గుట్టు రట్టు చేసేందుకు సర్కార్ ‘డిజిటల్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. ఇంటి పన్ను పత్రం, కరెంటు మీటర్, రిజిస్ట్రేషన్ డేటా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇళ్లు అని చెప్పి సాఫ్ట్‌వేర్ ఆఫీసులు, హాస్టళ్లు నడిపేవారికి కరెంటు బిల్లులే సాక్ష్యంగా మారుతున్నాయి.