News August 11, 2025

రొయ్య రైతులను ఆదుకోండి: తిరుపతి ఎంపీ

image

రొయ్య సాగు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. తిరుపతి జిల్లాలో సుమారు 28 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందన్నారు. సుంకాలు పెంచడంతో ఎగుమతులు ఆగిపోయాయని.. క్వింటాల్‌‌కు రూ.230 మేర ధర తగ్గిందని చెప్పారు. ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లను పరిశీలించి రైతులకు అండగా నిలవాలని ఆయన పార్లమెంట్‌లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 13, 2026

గాలి నుంచి నీరు.. తిరుపతి IIT విద్యార్థుల ప్రయోగం

image

గాలిని తీసుకుని అందులోని తేమను స్వీకరించి స్వచ్ఛమైన నీటిగా మార్చే యంత్రాన్ని తిరుపతి ఐఐటీ విద్యార్థులు రూపొందించారు. ‘ఎయిర్ టూ వాటర్’ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో అందుబాటులో ఉంచారు. గాలి నుంచి నీటిని సేకరించే బీటిల్స్, ఎడారిలో నివసించే కాక్టస్ మొక్కల నుంచి ప్రేరణతో దీనిని తయారుచేశారు. ఓ తమిళ సూపర్ స్టార్ వీటిని తనకు కావాలని ఆర్డర్ పెట్టించుకున్నట్లు సమాచారం.

News March 13, 2026

యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.

News March 13, 2026

జిల్లా రైతాంగంపై రూ.35 కోట్ల అదనపు భారం!

image

పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు దెబ్బ తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఈ తాజా నిర్ణయంతో ఎరువుల బస్తాపై ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి లెక్కగడితే, ఈ ధరల పెరుగుదల వల్ల జిల్లా రైతాంగంపై సుమారు రూ.35 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.