News February 6, 2025
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతి మృతి

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అమలాపురం(R) మండలం ఏ.వేమవరానికి చెందిన శ్రీదేవి (20) బుధవారం మృతి చెందింది. ఈనెల రెండవ తేదీన ఆటో ప్రమాదంలో యువతి తీవ్రంగా గాయపడింది. అమలాపురం టౌన్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీదేవి పదవ తరగతి వరకు చదువుకుంది. మార్కెట్ వీధిలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చి ఓడలరేవు బీచ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు.
Similar News
News March 9, 2026
బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్నిమెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.
News March 9, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 157 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 157 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 12,967 మంది విద్యార్థులకు గానూ 12,810 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.
News March 9, 2026
ఏలూరు జిల్లాకు 86.7 కి.మీల కొత్తదారి

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకు రెండు వరుసల హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹.368 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే హైదరాబాద్ – రాజమండ్రి ప్రయాణ దూరం తగ్గుతుంది. సుమారు 86.7 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణంతో 100 ఏజెన్సీ గ్రామాలు, 30 మైదాన ప్రాంత గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.


