News August 11, 2025
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు గాయాలు

కసింకోట మండలం బయ్యవరం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. బయ్యవరం గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ, సత్యవతి (51) దంపతులు బైక్ పై రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీ కొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందగా భర్తను ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు!

యూట్యూబ్‌లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్‌ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్‌తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్‌లు అవసరం లేకుండానే యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.
News March 9, 2026
పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
News March 9, 2026
భారత్ డామినేషన్.. 3 ఏళ్లలో 6 WCలు

గత 3 ఏళ్లలో భారత్ 6 క్రికెట్ వరల్డ్ కప్‌లు గెలిచింది. 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCతో పాటు తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. అన్ని జట్లను అభినందించారు. ఇది ఇండియన్ క్రికెట్‌కు గోల్డెన్ ఎరా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


