News January 30, 2025
రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలి: రోహిత్ రాజ్

కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్, ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో గురువారం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ అధికారులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
అప్పుడు జోగి రవాణా అయితే ఇప్పుడు ఎవరి రవాణా.?

పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన బుసక రవాణా నేటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి నాయకుల ఆరోపణల ప్రకారం, వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన బుసక రవాణా మొత్తం అప్పటి మంత్రి జోగి రమేశ్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిస్పందించిన వైసీపీ నాయకులు, బుసక రవాణా నేటికి కూడా అలాగే కొనసాగుతుంది. అప్పుగు జోగి కారణం అయితే, నేడు జరుగుతున్న రవాణాకు బాధ్యత ఎవరిది.? అని ప్రశ్నిస్తున్నారు.
News November 14, 2025
Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

జూబ్లీహిల్స్ బైపోల్ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో 42 బూత్‌లలో పోలైన ఓట్లను లెక్కించారు.
News November 14, 2025
విశాఖలో మొదలైన సీఐఐ సమ్మిట్

విశాఖలో సీఐఐ సమ్మిట్ మొదలైంది. ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి వ్యపారవేత్తలు హాజరయ్యారు. సదస్సుకు ముందురోజే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భారీగా ఎంవోయూలు జరిగాయి. ఈరోజు 25 సెషన్లలో వివిధ అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.


