News August 8, 2024

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు: సీపీ

image

కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విష సంస్కృతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. నూతనంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ర్యాగింగ్‌కు గురవుతున్న విద్యార్థులు తక్షణమే డయల్ 100కు చేయాలని సూచించారు.

Similar News

News December 9, 2025

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

image

రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులను ఆమె ఆదేశించారు.

News December 8, 2025

వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్‌ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.

News December 8, 2025

పోలింగ్ రోజున వరంగల్‌లో స్థానిక సెలవులు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.