News November 19, 2025
లక్కీ డిప్‌కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్‌లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్‌కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
Similar News
News January 24, 2026
బ్రహ్మంగారిమఠంలో రూ.139 కోట్లతో పనులు

బ్రహ్మంగారిమఠంలో శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రసాదం పథకం ద్వారా రూ.139కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆధునిక హంగులతో దేవస్థానం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News January 24, 2026
TODAY HEADLINES

⋆ తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
⋆ ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు
⋆ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ
⋆ పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR
⋆ తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI
⋆ రెండో టీ20లో NZపై భారత్ విజయం
⋆ WHO నుంచి వైదొలగిన అమెరికా
News January 24, 2026
ఎయిర్‌పోర్ట్‌లో అస్థిపంజరం కలకలం

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం కనిపించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. టెర్మినల్-3లో లగేజీ తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్‌లో కనిపించింది. వెంటనే పోలీసులు, ఎయిర్‌పోర్ట్ భద్రతా బృందాలు అప్రమత్తమయ్యారు. అయితే అది మెడికల్ విద్యార్థులు ఉపయోగించే డెమో స్కెలిటన్‌గా గుర్తించారు. ఆ బ్యాగ్ వైద్య విద్యార్థిది అని తేల్చారు. అయినప్పటికీ దానిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.


