News December 1, 2025

లక్ష్మీపల్లిలో ఎన్నికల జోష్.. 190 ఓట్లు సాధిస్తే సర్పంచ్

image

ఊట్కూర్ మండల పరిధిలోని చిన్న గ్రామ పంచాయతీ లక్ష్మీపల్లిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. మొత్తం 383 మంది ఓటర్లు ఉండగా, 6 వార్డులు ఉన్నాయి. 191 ఓట్లు సాధించిన అభ్యర్థి సర్పంచ్ అవుతారు, వార్డు సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 30 ఓట్లు సాధించాలి. చిన్న గ్రామమైనప్పటికీ అభివృద్ధిలో పెద్ద పంచాయతీలకు లక్ష్మీపల్లి గ్రామం ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడుతూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Similar News

News February 13, 2026

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సిపి సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని, కేవలం అనుమతి పత్రాలు ఉన్నవారినే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని స్పష్టం చేశారు.

News February 13, 2026

బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

image

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.

News February 13, 2026

సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

image

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.