News August 13, 2025
లక్ష్మీ నరసింహం: గుంటూరు తొలి ఎంపీ

స్వాతంత్ర్య సమరయోధుడు శిష్ట్లా వెంకట లక్ష్మీ నరసింహం 1911 మే 24న ఉమ్మడి గుంటూరులో జన్మించారు. 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్.జి.రంగాను ఓడించి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా 1936 నుంచి 2004 వరకు పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో రెండు సార్లు జైలుకు వెళ్లారు. 2006 సెప్టెంబర్ 28న 96 ఏళ్ల వయసులో మరణించారు.
Similar News
News March 13, 2026
ప్రొద్దుటూరు: పిజ్జా సర్వర్‌కి గోల్డ్ మెడల్

పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది ప్రొద్దుటూరుకు చెందిన సువర్ణరెడ్డి తోట సువర్ణ, YV విశ్వవిద్యాలయంలో 2019–2021 విద్యా సంవత్సరంలో MA హిస్టరీ పూర్తి చేసి ప్రతిభ కనబర్చింది. నేడు వైవీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమెకు గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. చదువు పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పిజ్జా సర్వర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు.
News March 13, 2026
భీమేశ్వరుడికి కానుకల వర్షం.. హుండీ ఆదాయం ఎంతంటే?

వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రెండు కోట్ల పదహారు లక్షలకు పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 33 రోజుల కాలంలో హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 2,16,65,140/- నగదు, 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
News March 13, 2026
పాలమూరు: కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి మృతి

మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డా కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.


