News October 4, 2025
లడ్డూ కావాలా నాయనా? దుర్గమ్మ భక్తులకు పండగే!

విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు తరలిరాగా.. వీరందరికీ గతేడాదితో పోలిస్తే ఈసారి ఆలయ అధికారులు రికార్డుస్థాయిలో లడ్డూలను పంపిణీ చేశారు. అక్టోబర్ 3 నాటికి 35 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగా.. 32 లక్షలను పంచారు. ఈ ఏడాది లడ్డూలను ప్రణాళికతో తయారుచేయడంతో భక్తులు ఎన్ని అడిగితే అన్ని ప్రసాదాలను పంచారు. మూలా నక్షత్రం రోజున 2 లక్షల లడ్డూలను ఉచితంగా అందించడం విశేషం.
Similar News
News January 22, 2026
5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.
News January 22, 2026
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ బీఈడీ నాలుగో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. మొత్తం 144 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కేవలం 28 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని ఆయన సూచించారు.
News January 22, 2026
నల్గొండలో మొదలైన రాజకీయ సెగలు

నల్గొండలో మున్సిపల్ పోరుకు ముందే రాజకీయ క్షేత్రం రగులుతోంది. అధికార ‘హస్తం’లో ఆశావహుల తాకిడి పెరగడంతో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. రెబల్స్ భయం నేతలకు గుబులు పుట్టిస్తోంది. అటు ‘గులాబీ’ దళాన్ని వలసలు వేధిస్తుంటే, ‘కమలం’లో అంతర్గత విభేదాలు శాపంగా మారాయి. స్వతంత్రుల వల్ల ఎవరి ఓట్లు చీలుతాయో చూడాలి. ఓటరు నాడి ఎటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


