News October 7, 2025
లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరువయ్యే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో మైనారిటీ సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులతో సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు అందించాలన్నారు.
Similar News
News January 23, 2026
WPL: యూపీపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.
News January 23, 2026
NGKL: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా సిద్ధం చేశామని వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.


