News August 13, 2025

లారీలో ప్రయాణించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

image

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు లారీలో ప్రయాణించారు. బుధవారం జన్నారం మండలం తపాలాపూర్ చెక్‌పోస్ట్ వద్ద ఆయన భారీ వాహనాల రాకపోకలను ప్రారంభించారు. అనంతరం తపాలాపూర్ చెక్‌పోస్ట్ నుంచి జన్నారం వరకు లారీలో వెళ్లారు. ఎమ్మెల్యే లారీలో ప్రయాణించి ప్రజలను ఆశ్చర్యపర్చారు. భారీ వాహనాల రాకపోకలకు ఇక నుంచి ఆటంకం ఉండబోదని ఎమ్మెల్యే బొజ్జు వివరించారు.

Similar News

News March 11, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 11)

image

1689: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మరణం
1915: భారత లెజెండరీ క్రికెటర్ విజయ్ హజారే జననం (ఫొటోలో)
1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
1979: తెలుగు సాహితీకారుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మరణం

News March 11, 2026

మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్..!

image

ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని హైదరాబాద్ మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

News March 11, 2026

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

image

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.