News January 17, 2025
లింగంపేట: బీడు భూములకు రైతుభరోసా రాకుండా చూడాలి: RDO

రైతు భరోసా సర్వేను ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం రైతు భరోసా సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధంగా చూడాలని AEOలకు, రెవెన్యూ అధికారులను సూచించారు. బీడు భూములకు రైతు భరోసా రాకుండా చూడాలన్నారు.
Similar News
News February 12, 2025
KMR: కోళ్లకు వైరస్.. కట్టడికి అధికారుల చర్యలు

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాథోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం కోళ్ల ఫామ్‌లో ఒకే సారి 8 వేలకుపైగా కోళ్లు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కోళ్ల దిగుమతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కట్టడిపై ఫోకస్ పెట్టారు.
News February 12, 2025
NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.
News February 12, 2025
నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి

నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.