News February 4, 2025
లింగంపేట: షూటింగ్ స్పాట్‌గా ‘నాగన్న బావి’

శతాబ్దాల కాలం నాటి నాగన్న బావి శిథిలావస్థకు చేరింది. కలెక్టర్, ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మంగళవారం నాగన్నబావి వద్ద కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పిట్లం, గాంధారి, డిచ్‌పల్లి తదితర గ్రామాలకు చెందిన కొందరు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. షూటింగ్ నేపథ్యంలో నాగన్న బావి పరిసరాలు సందడిగా మారాయి.
Similar News
News February 11, 2025
శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 34 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. >Share it
News February 11, 2025
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్… ఆ వాహనాలకు నో ఎంట్రీ

APలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఈవైరస్ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News February 11, 2025
సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశానికి ఆయన వచ్చిన 10 నిమిషాల తర్వాత మంత్రులు, అధికారులు తాపీగా రావడంతో సీబీఎన్ వారందరికీ క్లాస్ తీసుకున్నారు. సమయపాలన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని తేల్చిచెప్పారు.