News December 2, 2025

లేజర్ వెపన్ ‘ఐరన్ బీమ్’ సిద్ధం చేసిన ఇజ్రాయెల్!

image

అత్యాధునిక, హైపవర్ లేజర్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ‘ఐరన్ బీమ్’ను డిసెంబర్ 30న దళాలకు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలు, క్షిపణులు, రాకెట్లు, UAVs, డ్రోన్లను భూమిపై నుంచే ఛేదించేలా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 2014లోనే ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ ఆవిష్కరించింది. కానీ 11 ఏళ్లుగా అభివృద్ధి దశలోనే ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి సైన్యానికి అందించనుంది.

Similar News

News February 17, 2026

ESIC కాన్పూర్‌లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

image

<>ESIC<<>> కాన్పూర్‌ 4 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/డిప్లొమా( సివిల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.33,630 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 17, 2026

ప్రపంచంలోనే ధనిక గ్రామం.. ఎక్కడుందంటే?

image

గుజరాత్‌లోని మాదాపర్ సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ 17కు పైగా బ్యాంక్ శాఖలు ఉండటం విశేషం. ఇక్కడి కుటుంబీకులు విదేశాల్లో స్థిరపడినా తమ సంపాదనను సొంత ఊరి బ్యాంకుల్లోనే పొదుపు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. వీరి పొదుపు మంత్రం, పుట్టిన ఊరిపై ఉన్న మమకారం ప్రతి గ్రామానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

News February 17, 2026

మొక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి విషపు ఎర తయారీ విధానం

image

మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో సాయంకాలం వేయాలి. దీని కోసం ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని 2-3 లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తవుడులో కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటల పాటు పులియనిచ్చి, అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎరను మొక్క సుడిలో వేయాలి.