News March 18, 2025
లే అవుట్ క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: BHPL కలెక్టర్

లే అవుట్ క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం ఆయన ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియపై లే అవుట్ ఓనర్లు, లైసెన్స్ సర్వేయర్లు, డాక్యూమెంట్ రైటర్స్‌తో అవగాహన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఎల్ఎర్ఎస్ అమలులో వేగం పెంచాలని సూచించారు. ఫీజు చెల్లింపులో ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించిందన్నారు.
Similar News
News April 18, 2025
వికారాబాద్: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✔వికారాబాద్: ఈదురు గాలులతో భారీ వర్షం ✔ప్రధాని దిష్టిబొమ్మ దహనం.. చర్యలు తీసుకోవాలి’:BJP ✔పరిగి: పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పొంగులేటి ✔VKB: కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు: ఏసుదాస్ ✔సన్న బియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్ ✔TNDR: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ✔IPL బెట్టింగ్.. జర జాగ్రత్త: ఎస్సైలు
News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
News April 18, 2025
JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.