News March 5, 2025
లైనింగ్ పనులపై పరిటాల సునీత కీలక వినతి

హంద్రీ నీవా ద్వారా రాప్తాడులోని 38 చెరువులకు నీరందించాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. మంగళవారం ఆమె సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులతో నియోజకవర్గానికి ఎలాంటి నష్టం రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. యూపీపీ కాలువకు సంబంధించి భూసేకరణకు చెల్లించాల్సిన రూ.14.50కోట్లను విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
Similar News
News December 14, 2025
గద్వాల: నాలుగు మండలాల్లో 95,592 ఓట్లు నమోదు

గద్వాల జిల్లాలో 2వ విడతలో ఎన్నికలు జరిగిన 4 మండలాల్లో 1,12,087 మంది ఓటర్లు ఉండగా 95,592 మంది ఓటు వేశారు. అయిజ మండలంలో 39,377 మంది ఓటర్లకు 32,563 మంది, మల్దకల్ మండలంలో 37,915 మంది ఓటర్లకు 30,548 మంది, వడ్డేపల్లి మండలంలో 7,477 మంది ఓటర్లు ఉండగా 6,442 మంది, రాజోలి మండలంలో 28,038 మంది ఓటర్లకు 23,039 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 14, 2025
కోడ్ ముగిసే వరకు ర్యాలీలు నిషేధం

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. రెండో విడత ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కౌంటింగ్ అనంతరం విజేత ర్యాలీలు నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని అన్నారు.
News December 14, 2025
ములుగు: 44, 794 మంది ఓటేశారు!

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 44,794 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెంకటాపూర్, మల్లంపల్లి, ములుగు మండలాల్లో 54,94 4మంది ఓటర్లు ఉండగా.. మల్లంపల్లిలో 9,196, ములుగులో 16,132, వెంకటాపూర్లో 19,466 మంది ఓటేశారు. రెండో విడత పోలింగ్ శాతం 81.53%గా నమోదయింది.


