News December 2, 2025
లొంగుబాటు ప్రయత్నంలో మావోయిస్టు నేత బార్సే దేవా?

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ సభ్యుడు మడవి హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్థానంలో బార్సే దేవా బెటాలియన్ నంబర్-1 కమాండర్‌గా ఉన్నాడు. హిడ్మా మృతి తర్వాత అతడి స్థానాన్ని దేవా భర్తీ చేశాడనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ప్రస్తుతం దేవా సైతం లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. దేవాతో కేవలం 20 మంది క్యాడర్లు మాత్రమే ఉండగా, పార్టీ మనుగడ కొనసాగడం కష్టతరంగా మారినట్లు సమాచారం.
Similar News
News February 15, 2026
బంగ్లా ప్రయోజనాలకే ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

బంగ్లాదేశ్, ప్రజల ప్రయోజనాలే తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘ఈ గెలుపు బంగ్లాది. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం. హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నా’ అని చెప్పారు. తాజా ఎన్నికల్లో BNP <<19134014>>భారీ మెజారిటీ<<>>తో గెలవడం తెలిసిందే.
News February 15, 2026
కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.
News February 15, 2026
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.


