News June 3, 2024

వంగరలో పిడుగు పాటుకు మూగజీవాలు మృతి

image

వంగర మండలం పట్టువర్ధనం గ్రామ సమీపంలో పిడుగు పాటుకు ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగులు, చిన్ని అయ్యప్పకు చెందిన గొర్రెల మందతో పొలంలో కాపు కాస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలోకి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు.

Similar News

News September 12, 2024

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్

image

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. మెంటాడ పర్యటనకు వెళుతుండగా రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News September 12, 2024

‘ఉలిపిరి హెచ్ఎం‌పై పోక్సో కేసు పెట్టాలి’

image

ఉలిపిరి హెచ్ఎంపై పోక్సో కేసు పెట్టాలని పార్వతీపురం ఎస్ఎఫ్ఐ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి డి.పండు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. హెచ్ఎం కృష్ణారావు విద్యార్థులపై, ఉపాధ్యాయుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కురుకుట్టిలో పని చేసినప్పుడు ఇదే తంతు జరిగిందన్నారు. ఘటనపై విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలన్నారు.

News September 12, 2024

VZM: ‘ఈనెల 25 వరకు ఛాన్స్’

image

ఏపీ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి గడువు పొడిగించినట్లు డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఫైన్ లేకుండా ఈనెల 15లోగా అప్లై చేసుకోవచ్చన్నారు. రూ.200 ఫైన్ తో ఈనెల 25 వరకు అవకాశం ఉందన్నారు. అర్హతగలవారు సంబంధిత వెబ్ సైట్‌లో
అప్లై చేసుకోవాలన్నారు.