News September 11, 2025

వంగూరులో 64.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా వంగూరు మండలంలో 64.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. బిజినేపల్లిలో 51.8, నాగర్‌కర్నూల్ 44.8, తాడూరు 32.4, చారగొండ 14.2, ఉప్పునుంతలలో 17.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News December 9, 2025

కామారెడ్డి: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 167 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.

News December 9, 2025

NIT వరంగల్‌లో 45పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>NIT<<>> వరంగల్ 45 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడవును పొడిగించింది. అప్లైకి DEC 12 ఆఖరు తేదీ కాగా.. DEC 31వరకు పొడిగించారు. పోస్టును బట్టి PhD, ME, ఎంటెక్, MSc, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty

News December 9, 2025

IndiGo: నెట్‌వర్క్ పునరుద్ధరణ.. నేడు 250 సర్వీసులు రద్దు!

image

ఇండిగో సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తాజాగా నెట్‌వర్క్‌ను పూర్తిగా పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. అయినా దేశవ్యాప్తంగా నేడు 250కిపైగా సర్వీసులు రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల ఖాతాల్లో రూ.827 కోట్లు రీఫండ్ చేసినట్లు పేర్కొంది. గోవా, అహ్మదాబాద్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోని HYD, విశాఖలో ఇవాళ పలు సర్వీసులు రద్దయ్యాయి.