News November 30, 2025
వంగూర్: ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్యను అభినందించిన ఎంపీ

వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్యను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీ వెంట వ్యవసాయ కమిషన్ మెంబర్ కెవిఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News February 18, 2026
భారత వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు: రిజిజు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలున్నాయన్నారు. దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. నక్సలైట్లు, తీవ్రవాదులను రాహుల్ కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు జార్జ్ సొరోస్ వంటి నేతలను కలుస్తున్నారని ANIతో చెప్పారు.
News February 18, 2026
HYD: షాద్‌నగర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 18, 2026
ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

HYDలోని <


